కిరణ్ ఒంటరి అవుతాడా?


రాష్ట్ర విభజన ప్రక్రియ మొత్తం ముగిసేవరకు దగ్గరుండి కాంగ్రెస్ అధిష్ఠానానికి సహకరించి, తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, కొత్త పార్టీ పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో ఒంటరిగా మిగలనున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. దీనంతటికీ కారణం కిరణ్ కుమార్ రెడ్డి అనుంగు అనుచరులుగా భావిస్తున్నవాళ్లంతా ఒక్కొక్కరుగా ఆయన పెట్టిన పార్టీకి దూరం అయిపోవడమే. ఇంకా ఎన్నికల ప్రచారం ఊపందుకోక ముందే కిరణ్ పార్టీకి నాయకులు దూరమవుతున్నారు. ఏకంగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్ టీడీపీలో చేరేందుకు సిద్ధమైపోయినట్లు సమాచారం. మరో సీనియర్ నేత సాయిప్రతాప్ కూడా కిరణ్ పార్టీలో ఉంటే ప్రయోజనం లేదని నిర్ణయించుకున్నారని సమాచారం. ఇదిలా ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి కుడిభుజంగా నిలిచిన పశ్చిమగోదావరి జిల్లా నేత పితాని సత్యనారాయణ కూడా కిరణ్ కు టాటా చెప్పాలనుకుంటున్నట్లు సమాచారం. అందుకే చివరికి కిరణ్ పార్టీలో ఒక్కరే మిగిలేట్లున్నారని అంటున్నారు!!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment