గులాబీ దండులోకి కొండా దంపతులు


తెలంగాణ రాజకీయాల్లో వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ, కొండా మురళీ దంపతులది ప్రత్యేక స్టైల్. తెలంగాణ మొత్తం ఉద్యమాలతో మార్మోగిపోతుంటే... ఈ దంపతులు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జగన్ కు మద్దతు ఇచ్చారు. అందుకోసం సురేఖ ఏకంగా మంత్రి పదవిని కూడా త్యాగం చేశారు. జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని ఎంతో శ్రమపడ్డారు. అంతలోనే వైఎస్ఆర్ సీపీ 'యాజమాన్యం'తో వచ్చిన భేదాభిప్రాయాల వల్ల పార్టీలో ఇమడలేకపోయారు. దాంతో సొంత గూటికి వచ్చారు. ఏడాది కూడా తిరక్కుండానే ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ను ఎంతగానో విమర్శించిన వారే కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే మరి!!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment