లెజెండ్... రాజకీయ నేపథ్యమేనా?


బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మిస్తున్న ’లెజెండ్’... ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయ పరిణామాలు వేడి పుట్టిస్తున్నాయి. మరోవైపు భానుడు భగభగమంటున్నాడు. ఇంతటి వేడిలో.. సింహ గర్జన డైలాగులతో లెజెండ్ సిద్ధమైంది. ఇదిలా ఉంటే రాష్ట్ర రాజకీయాలకు సమకాలీనంగా ఈ చిత్రం ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అసలీ చిత్రాన్ని రాజకీయ వ్యూహంతోనే నిర్మించారని అంటున్నారు. ఇందులోని డైలాగులు కూడా అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

సీటు కాదు కదా  అసెంబ్లీ గేటు కూడా దాట నివ్వను...
రాజకీయం నీ ఫుడ్డులో ఉంది, నువ్వు పడుకునే బెడ్డులో ఉంది,  కానీ అది నా బ్లడ్డులోనే ఉందిరా బ్లడీ ఫూల్!...
నువ్వు భయపెడితే భయపడ్డానికి ఓటర్ని అనుకున్నావ్ బే-షూటర్ని! కాల్చి పారేస్తా నాకొడకా.....

ఇవన్నీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పలికిన పంచ్ డైలాగులేనని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బాలయ్య ఎన్నికల్లో పోటీ చేస్తాడో? లేదో? తెలియకపోయినప్పటికీ ఈ డైలాగులను రాజకీయ ప్రత్యర్ధులపై పరోక్షంగా విరిసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా తెలుగు దేశం పార్టీ విజయానికి ఎంత మేరకు సహకరిస్తుందో మరి!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment