విమానం జాడ దొరికేనా?


రెండు వారాల క్రితం గల్లంతైన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం కోసం అన్వేషణ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వడంలేదు. ఆస్ట్రేలియా దగ్గర సముద్రంలో విమానం శకలాలను పోలిన చిత్రాలున్నట్లు సాటిలైట్ల ద్వారా తెలిసినప్పటికీ... దక్షిణ హిందూ మహాసముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే వెతుకులాటలో ఉన్న విమానాలు ఆస్ట్రేలియాలోని పెర్త్ కు తిరిగి వచ్చేస్తున్నాయి. అమెరికా నేవీకి చెందిన పొసైడన్ ఎయిర్ క్రాఫ్ట్ లోనూ తగినంత ఇంధనం లేకపోవడంతో తిరిగి రాక తప్పలేదు. బ్లాక్ బాక్స్ నుంచి వెలువడే సందేశాల ఆధారంగా విమాన శకలాలు ఎక్కడున్నాయో గుర్తించవచ్చునని, అయితే ఆ బ్యాటరీ 25 రోజుల వరకూ పనిచేస్తుందని, ఇప్పటికే దాదాపు రెండు వారాలైపోయాయని అధికారులు అంటున్నారు. మలేషియాకి చెందిన రెండు విమానాలు, మూడు హెలీకాప్టర్లు, ఆరు పడవలు, చైనాకి చెందిన మూడు విమానాలు, మూడు హెలికాప్టర్లు, అయిదు పడవలు, ఇండోనీషియాకి చెందిన నాలుగు విమానాలు, ఆరు నౌకలు, ఆస్ట్రేలియాకి చెందిన అయిదు విమానాలు, ఒక పడవ, జపాన్ కి చెందిన నాలుగు విమానాలు, మన దేశానికి చెందిన రెండు విమానాలు, దక్షిణ కొరియాకి చెందిన రెండు విమానాలు, అమెరికా, న్యూజీలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన చెరొక్క విమానం, ఇంగ్లండ్ కి చెందిన ఒక నౌక అన్వేషణలో ఉన్నాయి. అదే ప్రాంతంలో ఉన్న నార్వే నౌక కూడా అదే పనిలో ఉంది. ఇదిలా ఉంటే సాటిలైట్ కెమెరాలకు చిక్కిన చిత్రాలు మలేషియా విమానానివేనా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అవి బోయింగ్ విమానపు రెక్కలై ఉండవచ్చునని కొందరు అంటున్నారు. రెక్కల్లో ఉండే ఫ్యూయల్ టాంకులు ఖాళీ అయిపోవడం వల్ల రెక్కలు పైకి తేలి ఉండవచ్చునని వారు అభిప్రాయ పడుతున్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment