Video Of Day

Breaking News

అచూకీ దక్కేదెప్పుడు? అన్వేషణ అగేదెన్నడు?

రెండు వారాల క్రితం గల్లంతైన మలేసియా విమానం ఎంహెచ్370కు సంబంధించినవై ఉండొచ్చని  దక్షిణ హిందూ మహాసముద్రంలో ఆస్ట్రేలియా గుర్తించిన శకలాల కోసం ఎంత అన్వేషించినా ఫలితం దక్కలేదు. దీంతో అవి సముద్రంలో మునిగిపోయి ఉంటాయని భావించారు. ఇదిలా ఉంటే హిందూ మహాసముద్రంలో ఆస్ట్రేలియా శకలాలను గుర్తించిన ప్రాంతానికి నైరుతి దిశగా 120 కి.మీ. దూరంలో మరో వస్తువును చైనా ఉపగ్రహం గుర్తించినట్లు శనివారం మలేసియా రక్షణ, రవాణా శాఖ మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ ప్రకటించారు. 22.5 మీ. పొడవు, 13 మీ. వెడల్పు ఉన్న ఆ వస్తువు అన్వేషణ కోసం చైనా రెండు నౌకలను పంపుతున్నట్లు తెలిపారు. అయితే విమానం బ్లాక్‌బాక్స్‌లో బ్యాటరీ 30 రోజులే పనిచేస్తుంది. మరో 15 రోజులు దాటితే బ్లాక్‌బాక్స్ నుంచి సంకేతాలు ఆగిపోయే అవకాశం ఉంది. ఏమాత్రం ప్రయోజనం లేదని భావించేదాకా అన్వేషణ కొనసాగించనున్నారు. విమానం ఆచూకీ కోసం సముద్ర గర్భంలో అన్వేషించేందుకు నిఘా పరికరాలను ఇవ్వాలంటూ అమెరికాను మలేసియా కోరింది. దీనిపై అమెరికా సానుకూలంగా స్పందించింది.

No comments