మలేషియా విమానం మిస్టరీ వీడినట్లేనా?


మలేసియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం ఎంహెచ్ 370  ఐదుగురు భారతీయులతో సహా 239 మందితో ఈ నెల 8న మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు బయల్దేరిన గంట తర్వాత కూలినట్లు తాజాగా మలేషియన్ ప్రధాని నజీబ్ రజాక్ ప్రకటించారు.
17 రోజులుగా గల్లంతైన ఈ విమానం గురించి విభిన్న కథనాలు వినవచ్చాయి. ఉగ్రవాద చర్య అని కొందరు, సాంకేతిక లోపం అని మరికొందరు ఇలా ఎన్నో రకాలుగా వార్తలు తీవ్ర ఉత్కంఠను రేపాయి. విమానాన్ని 25కు పైగా దేశాలు వెతికాయి. చివరగా హిందూ మహా సముద్రానికి నైరుతి దిశగా 2500 కిలోమీటర్లు దూరంలో శిథిలాలు లభించడంతో విమానం కూలినట్లు నిర్దారించారు. అత్యధునిక సాంకేతిక పరిజ్ఞానం కల్గిన బ్రిటన్ ఉపగ్రహం అందజేసిన ఛాయాచిత్రాల ఆధారంగా చర్యలు చేపట్టిన ఆస్ట్రేలియా ఆ విమాన శిథిలాలను కనుగొంది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment