మలేసియన్ ఎయిర్ లైన్స్ ఆచూకీ లభ్యం

malasiya-airlies-found

కనిపించకుండా పోయిన మలేసియన్ ఎయిర్ లైన్స్ విమానం శిథిలాలు దక్షిణ చైనా సముద్రంలో దొరికాయంటూ.. వాటికి సంబంధించిన మూడు శాటిలైట్ చిత్రాలను చైనా మార్చి 13న విడుదల చేసింది. వీటిని స్టేట్ అడమ్మినిస్ట్రేషన్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ, ఇండస్ట్రీ ఫర్ నేషనల్ డిఫెన్స్ సంస్థ విడుదల చేసింది. మూడు భారీ వస్తువులు సముద్రంలో తేలుతున్నట్లుగా ఆ చిత్రాల్లో ఉంది. వాటిలో ఒకటి 24 మీటర్ల వెడల్పు, 22 మీటర్ల పొడవు ఉండగా, మరొకటి 13 మీటర్ల వెడ
ల్పు, 18 మీటర్ల పొడవు, ఇంకొకటి 14 మీటర్ల వెడల్పు, 19 మీటర్ల పొడవు చొప్పున ఉన్నాయి. మలేసియా, వియత్నాం మద్యలో ఈ వస్తువులున్నాయి. ఇంతకుముందు కూడా కొన్ని శిథిలాలు కనిపించినట్లు చెప్పినా, అవేవీ కూడా అదృశ్యమైన ఎంహెచ్-370 విమానానికి సంబంధించినవి కావని తేలింది. తర్వాత చైనాకు చెందిన పది ఉపగ్రహాలు ఈ విమానం ఆచూకీ కోసం గాలించాయి.

ఈ మలేషియన్ ఎయిర్ లైన్స్లో మొత్తం 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో కలిసి కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయల్దేరింది. ఈ విమానానాకి మార్చి 8 తెల్లవారు జాము నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయి. కౌలాలంపూర్ లోని మార్చి 7 అర్ధరాత్రి 12.41 నిమిషాలకు బయలుదేరిన విమానం బీజింగ్ ఉదయం 6.30 నిముషాలకు చేరుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు పది దేశాలు విమానం ఆచూకీ కోసం వెతికాయి. విమాన ఆచూకీ కోసం భారత్‌ సహాయాన్ని కూడా మలేషియా కోరింది.

మొత్తం 239 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్న ఈ విమానం ఆచూకీ కోసం ఆరు రోజులుగా ప్రయత్నిస్తున్నా, చైనా అందించిన సమాచారం తప్ప ఎలాంటి వివరాలు ఇంతవరకు తెలియలేదు. ఈ విమానంలో ఐదుగురు భారతీయులతో పాటు 154 మంది చైనీయులు కూడా ఉన్నారు. వేర్వేరు దేశాలకు చెందిన 42 నౌకలు, 39 విమానాలు ఈ విమానం కోసం గాలిస్తున్నాయి.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment