Video Of Day

Breaking News

రాష్ట్రానికి అదనపు బలగాలు

రాష్ట్రపతిపాలన నేపథ్యంలో... ప్రస్తుతం ఉన్న కేంద్ర బలగాలకు తోడు ముందు జాగ్రత్తలో భాగంగా మరికొన్ని అదనపు బలగాలను కేంద్రం నుంచి రప్పిస్తున్నామని డీజీపీ బి.ప్రసాదరావు తెలిపారు. నగర పోలీసు కమిషనరేట్లు, ఇతర జిల్లాల్లో ముందస్తు చర్యగా పలు జాగ్రత్తలను తీసుకున్నామని వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలమేరకే భారీ  ఎత్తున డీఎస్పీల బదిలీలు జరిపామని, మరికొన్ని బదిలీలు జరుగుతాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సాధారణ ఎన్నికల్లో ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా చూస్తామని ఆయన తెలిపారు.  

No comments