పెళ్లైన హీరోలపై మోజు ఎందుకో!


నాటి సావిత్రి నుంచి నేటి కరీనా కపూర్ వరకు చాలామంది హీరోయిన్లు అప్పటికే పెళ్లైన హీరోలను మనువాడారు. "పదహారేళ్ల' అందగత్తె శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ను వివాహమాడింది. ఇతగాడికి అప్పటికే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. "బెబో' అని ముద్దుగా పిలవబడే కరీనా కపూర్.. సైఫ్ ఆలీఖాన్ ను పెళ్లాడింది. సైఫ్ కు ఇంతకుముందే అమృతా సింగ్ అనే హీరోయిన్ తో వివాహమైంది. ఇంకో ఆసక్తికర విషయమేమిటంటే.. అతని పెళ్లికి ప్రస్తుత భార్య కరీనా కూడా హాజరైంది. అప్పుడు అమ్మడి వయసు 11 ఏళ్లు కాగా. సైప్ వయసు 24 ఏళ్లు. మన తెలుగు చిత్రాల్లో కూడా నటించి "పొడుగు కాళ్ల' సుందరిగా పేరుగాంచిన శిల్పాశెట్టి కూడా రాజ్ కుంద్రా అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. ఇతనికి కూడా పెళ్లై పిల్లలున్నారు. అజిత్ బిల్లాలో స్విమ్ సూట్ తో అలరించిన నయనతార కూడా ప్రభుదేవాతో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమైంది. ఇంతలో ఏమైందో తెలియదు కానీ ఇద్దరి మధ్య వ్యహహారం బెడిసికొట్టింది. "డ్రీమ్ గర్ల్' గా పేరుగాంచిన హేమమాలిని కూడా అప్పటికే పెళ్లై పిల్లలున్న నాటి స్టార్ హీరో ధర్మేంద్రను పెళ్లాడింది. మరో సొగుసు కళ్ల సుందరి డింపుల్ కపాడియా రాజేశ్ ఖన్నాను వివాహమాడింది. ఇతనికే అప్పటికే పెళ్లైంది. "మహానటి'గా ఖ్యాతిగాంచిన సావిత్రి కూడా జెమిని గణేశ్ ను పెళ్లి చేసుకుంది. ఇతనికే అప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. నటిగా, దర్శకురాలిగా గిన్నిస్ రికార్డులు కెక్కిన విజయనిర్మల కూడా సూపర్ స్టార్ కృష్ణను పెళ్లాడింది! మరో నటి అమల అప్పటికే పెళ్లైనా నాగార్జునను పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికే ఆయన మొదటి భార్యతో విడిపోయారు. "7g బృందావనం కాలనీ' తో యువకుల గుండెల్లో జ్వాలలు రాజేసిన సోనియా అగర్వాల్.. తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ను పెళ్లాడింది. ఇలా ఎంతో మంది హీరోయిన్లు తమకంటే వయసులో పెద్దవారిని, పెళ్లై పిల్లలున్న హీరోలను వివాహమాడారు. దీనికి వీరు చెబుతున్న కారణం ఒకటే.. ఎలాంటి బాధ్యతలు లేనివారిని చేసుకుంటే.. జీవితంలో సుఖం, భద్రత ఉండదంట! వివాహితులైతే బాద్యతలు తెలిసి ఉంటాయి కాబట్టి వీరి జీవితం పూల పాన్పు అవుతుందంట!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment