మరో తెలంగాణ ఉద్యమ చిత్రం!

veeranari chakali ilamma director new movie on telangana
తెలంగాణ ఉద్యమ తీరు తెన్నులను తెరకెక్కించేందుకు మరో తెలంగాణ ఉద్యమ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వీరనారి చాకలి ఐలమ్మ చిత్ర దర్శకుడు మిరియాల రవికుమార్‌ తెలిపారు. శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో వీరనారి చాకలి ఐలమ్మ చిత్రం నిర్మించామని, త్వరలో ఓం శ్రీప్రొడక్షన్‌ జయహో తెలంగాణ అనే చిత్రానికి బోళ్ల సోమిరెడ్డి సమర్పణలో తాను దర్శకత్వం వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సహ నిర్మాతలుగా పరకాలకు చెందిన మార్క రఘుపతి, నడిగొట్టు శంకర్‌ వ్యవహరిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ చిత్రానికి తెలంగాణలోని నూతన కళాకారులను అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. చిత్రాన్ని పూర్తిగా తెలంగాణ జిల్లాల్లోనే నిర్మించి తెలంగాణ అమరవీరులకు అంకితం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment