మోడీతో నాగార్జున ఏం మాట్లాడారు?

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీతో కింగ్ నాగార్జున భేటీపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. కింగ్ రాజకీయాల్లోకి వస్తాడని, బీజేపీలో చేరతాడని, ఆయన భార్య అమలకు విజయవాడ నుంచి ఎంపీ టికెట్ అడగడానికి వెళ్తున్నాడని.. విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే మోడీతో భేటీ అనంతరం నాగార్జున మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రానని, లోక్‌సభ టికెట్ల కోసం వచ్చానన్న మీడియా కథనాలన్నీ నిరాధారమైనవని స్పష్టం చేశారు. అసలు తను టికెట్లు అడగలేదు.. అడగనని కూడా కుండ బద్ధలు కొట్టాడు. అసలు తాను, తన భార్య అమలతో పాటు ఇతర కుటుంబసభ్యులు రాజకీయాల్లోకి రావాలని అనుకోవటం లేదని చెప్పారు. ఏ పార్టీ తరఫున ప్రచారం కూడా చేయబోనని తేల్చేశారు. బీజేపీ ప్రముఖ నేతల ఆహ్వానం మేరకు తాను మోడీతో భేటీ అయ్యానని తెలిపారు. వెంకయ్యనాయుడు సూచనతో తాను మోడీతో సమావేశమయ్యానని వివరించారు. నరేంద్రమోడీ ప్రధానమంత్రి కావాలని తాను ఆకాంక్షిస్తున్నానంటూ మద్దతు ప్రకటించిన నాగార్జున.... తన భేటీలో ఎటువంటి రాజకీయ అంశాలూ చర్చకు రాలేదని చెప్పడం గమనార్హం. రాజకీయాల్లోకి రావాలని అనుకోనప్పుడు... అసలు రాజకీయాల గురించే మాట్లాడనప్పుడు
ఎన్నికల ముందు అహ్మదాబాద్ వెళ్లి మోడీని కలవాల్సిన అవసరం ఏమొచ్చిందో?
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment