Video Of Day

Breaking News

మోడీతో మన్మథుడి భేటీ దేనికి?


కింగ్ నాగార్జునకు కూడా రాజకీయాలపై దృష్టి మళ్లిందా? భార్య అమలకు ఎంపీ స్థానాన్ని కట్టబెట్టాలని చూస్తున్నాడా? లేక తానే ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడా? తాజా పరిణామాలు చూస్తుంటే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటికీ కారణం బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని కలవడానికి నాగార్జున అహ్మదాబాద్ వెళ్లడమే. పవన్ కల్యాణ్ ప‌వ‌న్ త‌ర‌హాలో పార్టీ పెట్టక‌పోయినా.. కింగ్  నాగార్జున కూడా మోడీకే  మ‌ద్దతివ్వాల‌ని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీని కలిసేందుకు నాగార్జున సోమవారం ఉదయం అహ్మదాబాద్ బయల్దేరారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన... మోడీతో సమావేశం అవుతారని సమాచారం. రెండు రోజుల క్రితం నాగార్జున బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడుతో మంతనాలు జరిపారు. ఈ క్రమంలోనే మోడీతో భేటిపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. అయితే నాగార్జున, మోడీల మధ్య ఏ అంశాలు చర్చకు రానున్నాయో, నాగార్జన ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడో? వేచిచూడాల్సిందే!

No comments