కోమటిరెడ్డి బ్రదర్స్ కు ప్రతికూల పవనాలు!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. జిల్లాలో
కోమటిరెడ్డి బ్రదర్స్ కు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న భువనగిరి పార్లమెంట్ టికెట్‌పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కన్నేయడం కూడా జిల్లా రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చింది. అంతేకాదు అధిష్టానానికి టీపీసీసీ పంపిన జాబితాలో రాజగోపాల్‌రెడ్డి పేరు లేకపోవడం జిల్లా రాజకీయాలను తారా స్థాయికి చేర్చింది. ఇదిలాగే కొనసాగితే కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ వీడే పరిస్థితి రావచ్చేమోనని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. వెంటనే ఏఐసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు రంగంలోకి దిగారు. కోమటిరెడ్డికి ఫోన్‌చేసి పార్టీ వీడొద్దని కోరాల్సి వచ్చింది. దీంతో పాటు జానారెడ్డి కూడా అధిష్ఠానం సూచన మేరకు రాజగోపాల్‌రెడ్డి నివాసానికి వెళ్లి విభేదాలను పక్కనపెడదామని సూచించారు. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ టికెట్లు తమకు ఖాయమని ధీమాకు వచ్చారు. కానీ, తాజా పరిణామాలతో కోమటిరెడ్డి బ్రదర్స్ కంగుతిన్నారు. దీనిపై ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు రాజగోపాల్‌రెడ్డిని బుజ్జగించేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. అయినా శాంతించకపోవడంతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో మాట్లాడించాలని భావించారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment