"నానీలు'' ఎటువైపు?


రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో అందరూ ఎన్నికల పోరాటానికి సిద్దమవుతున్నారు. అయితే నానీలుగా పేరున్న ఆళ్ల నానీ (ఏలూరు), పేర్ని నాని (మచిలీపట్నం), కొడాలి నాని (గుడివాడ), ఈలినాని (తాడేపల్లి గూడెం)ల చూపు ఎటువైపు ఉందో తెలియక నానీల అభిమానులు బిక్కమొహం వేస్తున్నారంట! అయితే కొడాలి నాని వైకాపా నుంచి పోటీ చేయడం తథ్యం. ఈలి నాని మినహాయించి మిగిలిన నానీలు కూడా జగన్ తో జట్టు కట్టడం ఖాయం. ఇకపోతే ఈలి నాని మాత్రం తెలుగుదేశంలో చేరాలనే ఆలోచనలో ఉన్నారని వినికిడి! త్వరలో బాబును కలిసి దేశం తీర్థం తీసుకోవడం ఖాయమని సమాచారం! బాబు కూడా కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈలి నాని మరోమారు తాడేపల్లి గూడెం నుంచి పోటీకి దిగడం లాంఛనమే అనుకోవాలి! ఈలి నాని 2009 లో ప్రజారాజ్యం పార్టీ నుంచి విజయం సాధించాడు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment