అత్యంత సంపన్న అభ్యర్థిగా నీలేకని!


ఎన్నికల కమిషన్కు దాఖలు చేసే ఆస్తుల విలువలో మన రాజకీయ నేతలు కచ్చితమైన లెక్కలు చూపుతారని ఎవరూ అనుకోరు. ఆ లెక్కకు మించిన ఆస్తులు వారి దగ్గర, బినామీల పేర్లతో ఉంటాయనేది బహిరంగ రహస్యం. అయితే వారు వెల్లడించిన విలువల ప్రకారం సంపన్నుడెవరని ప్రతిసారీ సగటు ఓటరు అంచనా వేసుకుంటూ ఉంటాడు. అయితే ఈ సారి నామినేషన్ల ప్రక్రియ ఇంకా పూర్తి కానప్పటికీ ఇప్పటివరకు ఉన్న విలువల ప్రకారం బెంగుళూరు దక్షిణ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న ఐటీ దిగ్గజం నందన్ నీలేకని అత్యంత సంపన్నుడయ్యే అవకాశం ఉంది. తన ఆస్తుల విలువ 7,770 కోట్లుగా ఎన్నికల కమిషన్ కు దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.  తన ఆస్తుల్లో 80 శాతం ఇన్ఫోసిస్‌లో షేర్ల రూపంలో ఉన్నాయని నందన్ పేర్కొన్నారు. తన పేరుమీద 1.45 శాతం, భార్య రోహిణి పేరు మీద 1.3 శాతం షేర్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు. పార్లమెంట్ బరిలో దిగుతున్న వారిలో నీలేకని అత్యంత సంపన్నుడు అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ 114 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment