నాన్నా.. నాకు సీటు కావాలి!


నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ దిగ్గజాలను వారసుల పోరు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహ్మద్ షబ్బీర్ అలీలకు తనయుల పోరు మొదలైంది. జనరల్ మహిళకు నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ పదవిని రిజర్వు చేయడంతో, మాజీ మేయర్, డీఎస్ కుమారుడు ధర్మపురి సంజయ్ అసెంబ్లీ సీటుపై కన్నేశారు. నిజామాబాద్ అర్బన్ నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓటమిపాలైన డీఎస్ ఈసారి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. కాగా, ఆయన కుమారుడు నిజామాబాద్ అర్బన్ స్థానం కోసం పట్టుబడుతుండటం గమనార్హం. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఎమ్మెల్సీగా మరో ఐదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉన్నందున.. కామారెడ్డి కాంగ్రెస్ టికెట్ తనకే ఇప్పించాలంటూ ఆయన కుమారుడు మహ్మద్ ఇలియాస్ ఉత్సాహ పడుతున్నారు. ఈ ఇద్దరు నేతలు..వారి తనయుల పరిస్థితి ఇలా ఉండగా నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాలు తండ్రీకొడుకులకు కేటాయిస్తే తన పరిస్థితి ఏమిటన్న సందేహంలో మహిళా కాంగ్రెస్ రాష్ర్ట అధ్యక్షురాలు ఆకుల లలిత ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment