ఇలా వచ్చి.. అలా వెళ్లి.. కనుమరుగైన పార్టీలు!

2009 ఎన్నికల ముందు ఎన్నో కొత్త పార్టీలు ప్రజల ముందుకొచ్చాయి. ప్రముఖ నటీమణి విజయశాంతి తల్లి తెలంగాణ పేరుతో పార్టీ ఏర్పాటు చేసి. దాన్ని తెలంగాణ రాష్ర్ట సమితిలో విలీనం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నెంబర్ 2గా చక్రం తిప్పిన దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ ప్రజా పార్టీని ఏర్పాటు చేసి దాన్ని చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశారు. బీజేపీలో ప్రముఖ నేతగా వెలుగొంది, అభిమానులతో "టైగర్' అనిపించుకున్న ఆలె నరేంద్ర.. తెలంగాణ సాధన సమితిని ఏర్పాటు చేసి దాన్ని కేసీఆర్ పార్టీలో కలిపేశారు. ఇక.. ఎన్టీఆర్ తర్వాత.. ఆ స్థాయిలో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా పేరు ప్రఖ్యాతులున్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసి దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు. మహబూబ్ నగర్ కు చెందిన మాజీ తెలుగు దేశం నేత నాగం జనార్ధన్ రెడ్డి .. తెలంగాణ నగారా పేరుతో పార్టీని ఏర్పాటు చేసి దాన్ని బీజేపీలో కలిపారు. ఇలా ఎన్నో పార్టీలు ఆదిలోనే చతికిల పడ్డాయి. మరి పవన్ కల్యాణ్ జనసేన.. ఇదే ఒరవడిని కొనసాగిస్తుందా? లేదంటే సంచనాలకు శ్రీకారం చుడుతుందా అనేది వేచి చూడాలి.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment