విభజన నాటికి రెండుగా రంగా వర్సిటీ

ng-ranga-agri-university

రాష్ట్రస్థాయిలో ఒకే వర్సిటీగా ఉన్న ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండుగా విడిపోనుంది. విభజన అమలులోకి వచ్చే తేదీ జూన్‌ 2 నాటికి రంగా వర్సిటీ విభజన ప్రక్రియ పూర్తికానుంది. అందుకు అవసరమైన పనులు చకచకా జరిగిపోతున్నాయి. సీమాంధ్రలో వర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. గుంటూరు జిల్లా బాపట్ల, చిత్తూరు జిల్లా తిరుపతిలలో ప్రస్తుతమున్న వ్యవసాయ పరిశోధనా కేంద్రాలలో ఒకదానిని పూర్తిస్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలున్నాయి. మరోవైపు కొత్తగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేకన్నా... పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలో ఉన్న ఉద్యాన వర్సిటీనే పూర్తిస్థాయి వ్యవసాయ వర్సిటీగా స్థాయి పెంచాలన్న ప్రతిపాదన కూడా తెరమీదకు వస్తోంది. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment