Video Of Day

Breaking News

మరో ప్రేమకథతో నితిన్‌

నితిన్‌ మరో ప్రేమకథతో రాబోతున్నారు. ఈ సారి తనకు తోడుగా 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'తో నవ్వులు పండించిన భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను తోడుగా తీసుకొస్తున్నారు. శ్రీనివాసరెడ్ది దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో నితిన్‌ సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ని ఎంచుకున్నారు. శ్రవణా పిక్చర్స్‌ పతాకంపై నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనూసూద్‌ ప్రతినాయక పాత్రలో కనిపిస్తారు. త్వరలో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్థన్‌, సంగీతం: సాగర్‌ మహతి, కళ: రాజీవ్‌ నాయర్‌, కూర్పు: ప్రవీణ్‌ పూడి.

No comments