'అన్నయ్య'తో విభేదాల్లేవ్!



ఎప్పుడూ సైలెంట్ గా ఉంటూ, మీడియాకు దూరం మెయింటేన్ చేస్తున్న పవన్ కల్యాణ్ తనకు తానుగా నోరు విప్పాడు. ఏకంగా ఆదివారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశాడు. గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నట్లుగా తనకు, చిరంజీవికి మధ్య ఎటువంటి విభేదాలు లేవని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అందులో వివరించాడు. పార్టీ ఏర్పాటు, ఎన్నికల్లో పోటీ అంశాలపై త్వరలోనే స్పందిస్తానని కూడా చెప్పారు. ఈ నెల రెండో వారంలో మరిన్ని వివరాలు వెల్లడిస్తానన్నారు. ప్రస్తుతం గబ్బర్ సింగ్ 2, ఓ మైగాడ్ రీమేక్ సినిమాల్లో బిజీగా ఉన్నట్టు తెలిపారు. అయితే ఈ వ్యవహారం అంతా కనీసం లెటర్ హెడ్ కూడా వాడకుండా చేతి రాతతో కూడిన పేపర్ పై రాసి పత్రికా కార్యాలయాలకు పంపడం విశేషం.


Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment