నువ్వే నా బంగారం రివ్యూ

సంస్థ: శ్రీధనలక్ష్మి మూవీస్‌

నటీనటులు: సాయికృష్ణ, షీనా, నిషాకొఠారి, సుమన్‌, తనికెళ్ల భరణి, సన, రాజశ్రీ నాయర్‌, ప్రవీణ్‌, శ్రావణ్‌, మహేశ్వరి
సంగీతం: యాజమాన్య
నిర్మాత: పేరిచర్ల కృష్ణంరాజు
దర్శకత్వం: రామ్‌ వెంకీ

సూర్య (సాయికృష్ణ) మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన విద్యార్థి. తన కాళ్లమీద తాను నిలబడాలనుకొనే మనస్తత్వం కలవాడు. స్వేచ్ఛగా బతకడం అంటే ఇష్టం. అందుకే ఇంట్లో వాళ్లకు దూరంగా ఉంటాడు. హారిక (షీనా) ఇంజనీరింగ్‌ చదువుతుంటుంది. అమ్మానాన్న అంటే గౌరవం. 'మీరు చూపించిన అబ్బాయినే పెళ్లిచేసుకొంటా' అని ఇంట్లోవాళ్లకు మాటిస్తుంది. కానీ అనుకోకుండా సూర్య, హారిక ప్రేమలో పడతారు. ఆ తరవాత ఏమైంది? సూర్య, హారిక ఇద్దరూ తల్లిదండ్రుల మాట తప్పారా? స్వేచ్ఛను దుర్వినియోగం చేశారా? అనేది తెరపై చూడాలి.
''యువతరం రెండు విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. ప్రేమని, కెరీర్‌ని ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు. జీవితం బాగుండాలంటే రెండూ లైట్‌ తీసుకోకుండా ముందుకు సాగాలి. అదే సమయంలో తల్లి
దండ్రులకు పిల్లలపై నమ్మకం ఉండాలి. ఈ చిత్రంలో ఈ విషయాన్నే చెబుతున్నాం. తల్లిదండ్రులకు పిల్లలు బంగారంలానే కనిపిస్తారు. పిల్లలకూ వాళ్ల తల్లిదండ్రులు బంగారమే. యాజమాన్య అందించిన బాణీలు ఆకట్టుకొంటాయి. ప్రతిపాటా కథని నడిపించేదే.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment