ఊపందుకున్న పార్టీల ప్రచార పర్వాలు

ఒకవైపు మున్సిపోల్స్
మరోవైపు జిల్లా పరిషత్
ఇంకోవైపు శాసనసభ, లోక్ సభ
హైదరాబాద్ : రాష్ర్టంలో పార్టీల మైకులు షీకార్లు చేస్తున్నాయి. ఒకే సారి మూడు స్థాయిల్లో ఎన్నికలు వచ్చేసరికి నాయకులకు, మైకులకు తీరికలేకుండా అయిపోయింది. విభజన నెలకొన్న దృష్ట్యా ఇరు ప్రాంతాల్లో పార్టీలు పట్టుకోసం నానా తంటాలు పడుతున్నాయి. తెలంగాణ వాదం, సమైక్య నినాదంతో కొన్ని పార్టీలు తమ ప్రత్యేకతను సాధించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలు ఇరు ప్రాంతాల్లో గట్టెక్కేందుకు, ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునే దిశలో నానా తంటాలు పడుతున్నాయి. ఎలగైనా తమ ప్రసంగాలతో ఓటర్లను మెప్పించేందుకు గంటలు గంటలు స్టేజి ప్రసంగాలు చేస్తూ .. హామీలు గుప్పిస్తున్నాయి.  
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment