Video Of Day

Breaking News

పవన్ నాకు ప్రత్యర్థే: చిరంజీవి


జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ తనకు తమ్ముడు అయినప్పటికీ పార్టీ పరంగా చూస్తే ప్రత్యర్థేనని అన్నయ్య చిరంజీవి అన్నారు. ఒకే కుటుంబానికి చెందినంత మాత్రాన తమ సిద్ధాంతాలు ఒకటే కావాలనేమీ లేదన్నారు. పవన్‌కు తొలినుంచీ కొన్ని సిద్ధాంతాల పట్ల నిబద్ధత ఉందని, వాటి ప్రకారమే ఆయన జనసేన పార్టీని స్థాపించారని చెప్పారు.  పవన్ ‘కాంగ్రెస్ హటావో’ అంటే తాను కాంగ్రెస్‌ను పటిష్టం చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వారంతా తమకు ప్రత్యర్థులేనని చెప్పారు. అయితే అన్నగా తమ్ముడికి తన ఆశీస్సులుంటాయని పేర్కొనడం గమనార్హం. 

No comments