Video Of Day

Breaking News

పవన్ 'ఇజం'.. 12 అధ్యాయాలు.. 145 పేజీలు...


ఇటీవల ప్రారంభించిన జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రతిబింబించేలా రాసిన ఓ పుస్తకం 'ఇజం'ను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నంలో నేడే(గురువారం) ఆవిష్కరించనున్నారు. ఇప్పుడు అందరి మదిలో ఆ ఇజంలో ఏ ముండబోతుంది. పార్టీ సిద్ధాంతాలకే పరిమితమవుతుందా? ఇతర రాజకీయ పార్టీలపై విమర్శలు ఉంటాయా? అని అభిమానులు ఉత్కంఠతో ఉన్నారు. కవర్ పేజ్... 145 పేజీలు... 12 అధ్యాయాలతో కూడిన ఈ పుస్తకం ప్రధానంగా జనసేన పార్టీ సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తుందని సమాచారం. రాజు రవితేజ్‌తో కలిసి పవన్ కల్యాణ్' రచించిన ఈ పుస్తకంలో 12 అధ్యాయాలు.. 145 పేజీలు ఉంటాయని సమాచారం. ఇంకా ఇందులో ఏయే విశేషాలు ఉండబోతున్నాయో మరి! ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందో మరి!

No comments