పవన్ ఎన్నికల్లో పోటీ చేస్తాడా?


జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయా? చేస్తే ఏ స్థానం నుంచి పోటీ చేయనున్నాడు? పదవులపై తనకు వ్యామోహం లేదని చెబుతున్న ఈ జనసేనాని అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదంటున్నాడు. పార్టీ పవర్ కోసం కాదు... ప్రశ్నించడానికంటూ బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు. ఇదిలాఉంటే ప్రశ్నించేందుకే అయితే ముందుగానే పార్టీలకు మద్ధతు ప్రకటించడం దేనికని కొందరు ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో జరిగిన 45 నిమిషాల భేటీలో బీజేపీకి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన తెలిపిన విషయం తెలిసిందే. మోడీ ప్రధానమంత్రి అవుతారని, అందులో సందేహం లేదని కూడా పవన్ విశ్వాసం వ్యక్తం చేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేయాలో, లేదో ఇంకా నిర్ణయించుకోలేదని తెలిసింది. ఈ అంశాలపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటివరకు ఈ సస్పెన్స్ కొనసాగాల్సిందే మరి!

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment