పవన్ జత ఎవరితో?


మార్చి 14న హైదరాబాద్‌లో 'జనసేన'ను ప్రారంభించిన పవన్ కల్యాణ్ పొత్తుల దిశగా పావులు కదుపుతున్నారు. 'కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో'  అని ఆయనిచ్చిన నినాదానికి సరిపోలే పార్టీలతో జత కట్టేందుకు రెడీ అవుతున్నారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ, బీజేపీ, జై సమైక్యాంధ్ర పార్టీ... ఈ నాలుగూ కాంగ్రెస్‌కు వ్యతిరేక పార్టీలే అయినప్పటికీ పవన్ చంద్రబాబుతో కలవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీకి అనుకూలమనే ప్రచారం ముందు నుంచీ జరుగుతున్న విషయం తెలిసిందే.  'జనసేన' పార్టీ ప్రారంభించిన తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ పబ్లిక్‌లో కనిపించకుండా సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్నారు. పార్టీ ప్రారంభించిన మరుసటి రోజునే పవన్ హైదరాబాద్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయ్యారని సమాచారం. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలిసి కూటమి గురించి చర్చించినట్లు కూడా తెలిసింది. ఏదేమైనా పవన్ పార్టీ పెట్టి చురుగ్గా పనులు చక్కదిద్దుకుంటున్నారు. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను అనువుగా మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment