'పవన్‌ తప్పు చేసినా వాడి తలకాయ తీయాలి'


pawan-speech-at-visag-meeting-accused-should-punish

విశాఖపట్నంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లడుతూ.. చట్టాలు ఎవరికీ చుట్టాలు కావొద్దని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ధనవంతుడికో రీతి.. పేదవాడికో రీతి తరహా ఉండకూడదని చెప్పారు. ఇలాంటి వివక్షల వల్ల నిజాయితీగా వ్యవహరించే సీబీఐ, పోలీసు అధికారులు బలిపశువులు అవుతున్నారని, జేడీ లక్ష్మీనారాయణ ఉదంతమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ఏసీబీ అధికారులు చిరుఉద్యోగుల్ని పట్టుకుంటూ లక్షలకోట్లు దోచుకునే పెద్దచేపల్ని వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్‌ తప్పు చేసినా వాడి తలకాయ తీసే చట్టం రావాలని ఆవేశంగా అన్నారు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment