నమోయే సమర్థ నాయకుడు: పవన్

pawan-speech-at-visag-meeting-modi-the-best-leader

బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీయే దేశానికి సమర్థ నాయకుడు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అందుకే అయన్ను కలిసి మద్ధతు తెలిపానని వివరించారు. మోడీని కలిసినపుడు చాలా మంది నానా రాద్ధాంతం చేశారని చెప్పారు. కానీ దేశ ప్రధానిగా మనల్ని ఉత్తేజపరిచే శక్తి మోడీకే ఉందని నమ్ముతున్నానని స్పష్టం చేశారు. 'నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడే నాయకుడు మనకు కావాలి. దేశాన్ని ఉత్తేజపరిచే వారు కావాలి. మోదీ ఏ పార్టీ నాయకుడైనా కావచ్చు. కానీ... భయంలేకుండా, బలంగా మాట్లాడగలరు. రాష్ట్ర విభజన విషయంలో కూడా కరెక్ట్‌గా మాట్లాడింది ఆయనే. ఆయనకు మన సమస్యలు చెప్పడానికి తెలుగు నేల నుంచి ఎవరో ఒకరు కావాలి. అందుకే నేను వెళ్లాను' అని అన్నారు. నరేంద్రమోడీ నాయకత్వంపై నమ్మకముందని, ఆయనను ప్రధానిగా చూడాలనుందని ఆకాక్షించారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment