పవన్ అభిమానిగా మారా - మహేశ్ బావ సుధీర్!

ఇంతకుముందు తాను పవన్ కల్యాణ్ అభిమానిని కాదని అయితే పవన్ ప్రసంగం విన్నాక ఆయన అభిమానిగా మారానని ప్రేమకథా చిత్రమ్ కథానాయకుడు సుధీర్ బాబు ట్వట్టర్ లో పేర్కొన్నారు. ఇతనే కాకుండా చాలామంది సినీతారలు పవన్ ప్రసంగం అద్భుతమని పేర్కొన్నారు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు పవన్ రాజకీయాల్లోకి వస్తున్నారంటేనే ఆయన నిజంగా ప్రజాసేవ చేయడానికి వస్తున్నారని అర్ధమవుతుందని సినీ నటుడు బ్రహ్మాజీ అన్నారు. పవర్ స్టార్ సామాన్య ప్రజల మనసులో ఉన్న మాట చెప్పారని ప్రముఖ గాయని, హాయ్ రబ్బా ఆల్బం ఫేమ్ స్మిత చెప్పారు. ఇక నితిన్ అయితే తాను తన బాస్ వెంటేనని చెప్పాడు. మరో వర్ధమాన నటుడు నిఖిల్.. తన మనసులో ఉన్న ప్రతి మాట పవన్ నోటి వెంట వచ్చిందని తెలిపారు. తాను జనసేన ఐడియాలజీకి మద్ధతునిస్తున్నానని అన్నారు. కొత్త బంగారులోకం ఫేమ్ వరుణ్ సందేశ్ కూడా పవన్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇలాంటి ప్రసంగం తాను ఇంతకుముందు ఎక్కడా వినలేదని తెలిపాడు. పవన్ ప్రసంగం అద్బుతమని సినీనటుడు నాని పేర్కొన్నారు. హ్యాపీడేస్, ఆనంద్, గోదావరి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల పవన్ కు హ్యాట్సాఫ్ చెప్పారు. పవన్ స్పీచ్ తెలుగు ప్రజల మనోభావాలను ప్రతిఫలించిందని తెలిపారు. పవన్ కు ఇతర రాజకీయ నాయకుల కంటే ఎక్కువ రాజకీయ పరిజ్ఞానం ఉందని మధుర శ్రీధర్ చెప్పారు. పవన్ కల్యాణ్ స్ఫూర్తివంతమైన ప్రసంగాన్ని ఇచ్చారని ప్రముఖ గాయకుడు రఘు కుంచె తెలిపారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment