Video Of Day

Breaking News

'పవన్ కల్యాణ్ మద్దతిస్తానంటే ఆహ్వానిస్తాం'

సినీనటుడు పవన్ కల్యాణ్ ....భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తానంటే ఆహ్వానిస్తామని ఆపార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. కాగా కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో' నినాదంతో క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించిన  పవన్ కల్యాణ్ బీజేపీకి దగ్గరవుతున్నట్టు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తన కథనంలో వెల్లడించింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతో పవన్ కళ్యాణ్ సోమవారం (నేడు) సమావేశం కాబోతున్నట్టు తన కథనంలో వెల్లడించింది. అయితే అధికారికంగా ఈ భేటికి సంబంధించిన విషయాలు వెల్లడికాలేదు.

No comments