పవన్ వెనుక చంద్రబాబా?

Pawan with chandrababu

రాజకీయాల్లోకి కొత్త పార్టీతో 'పవర్'ఫుల్ ఎంట్రీ పవన్ కల్యాణ్.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో జత కట్టనున్నాడనే ప్రచారంపై అటు అభిమానుల్లో, ప్రజల్లో పలు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ వెనక చంద్రబాబు ఉన్నాడని కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయనని చెప్పినందువల్లే బాబు.. 'పవర్'ను ప్రయోగించాడని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో జూ. ఎన్టీఆర్ టీడీపీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రమాదం జరిగి గాయాలైన చంద్రబాబుకు ఓటెయ్యండిని హాస్పిటల్ బెడ్ మీద ఉండే అభిమానులను కోరారు. అలాంటిది ప్రస్తుతం ఎన్నికలు తరుముకొస్తున్నా... కిమ్మనకుండా ఉండడంతో పై వాదనలకు బలం చేకూరుతోంది. అంతేగాకుండా ప్రస్తుతం 'బాద్షా' కంటే 'గబ్బర్ సింగే' మేలని బాబు భావించారని కూడా అంటున్నారు. అందుకోసమే అబ్బాయ్ ని కాదని పవన్ కల్యాణ్ ను బాబు తెరమీదకు తెచ్చాడంట. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment