నేటితే సస్పెన్స్ కు తెరదించనున్న పవన్

జనసేనపై పెదవి విప్పనున్న పవన్
హైటెక్స్ లో సభకు మీడియాకు ఆహ్వానం
అనుమతులు సైతం ఓకే చెప్పిన పోలీసుశాఖ
pawan kalyan new party
హైదరాబాద్ : గత 20 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతున్నారంటూ వస్తున్న వార్తలకు నేడు హైటెక్స్ వేదికగా అందరి ఊహాగానాలకు పవన్ కళ్యాణ్ తెరదించనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతున్నారని, పేరుకూడా ఖరారైనట్లు అనునాయులు ఊదరగొడుతూ వస్తున్న నేపథ్యంలో అందరి చూపులు ఇక్కడ జరిగే సమావేశంపైనే ఎదురు చూస్తున్నారు. ఇదివరకే అన్నయ్య చిరు ప్రజారాజ్యం పార్టీలో చురుకుగా పాల్గొన్న పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం విలీనం కావడం వంటి విషయాలు అభిమానులను కొంతవరకు బాధించాయనే చెప్పవచ్చు. అయితే ఇటీవల మెగా ఫ్యామిలీలో పవన్ పై గుర్రుగా ఉంటున్నట్లు కూడా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పవన్ కొత్త పార్టీ పెడితే మెగా ఫ్యామిలీ అభిప్రాయాలను సేకరించిన మీడియా కొడుకు వరుసైన రామ్ చరణ్ బాబాయి పార్టీ పెడితే మద్దతిస్తారా? అన్న ప్రశ్నకు నేను నాన్నతోనే ఉంటానని చెప్పడం జరిగింది. తాజాగా రెండో అన్నగారైన నాగబాబు కూడా పవన్ పార్టీ వ్యక్తిగతం.. నేను కూడా అన్నయ్య పక్షానే ఉంటానని చెప్పడం విశేషం. కాకపోతే పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితంపై విరక్తి చెందిన చిరు తమ్ముడు పవన్ పై గుర్రుగా ఉంటున్నారు చిరు. దీంతో మెగా ఫ్యామిలీ మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చేరుకున్నాయి? ఈ పరిణామాలన్నింటిని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ పార్టీపై నేడు ఏమి చెబుతారనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్టీ పెడతారా? లేక ఇదంతా మీడియా సృస్టే నేను పార్టీ పెట్టను అంటారా? లేక పార్టీ పేరును ప్రకటిస్తారా? అనేది నేటి సాయంత్రం వరకు వేచిచూడాల్సిందే?
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment