మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ!

రాజకీయాల్లో కీలక పాత్రకు పవన్ యత్నం
సీమాంద్రలో తన పట్టుకోసం బీజేపీకి అవకాశం
సీమాంద్రలో బీజేపీ - టీడీపీ- జనసేన షికారు

హైదరాబాద్ : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అహ్మదాబాద్ కు పయనమై వెళ్ళారు. భారతీయ జనతాపార్టీ ప్రచార కార్యదర్శి, ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. దీంతో రాష్ర్టంలో పవన్ పై, రాజకీయ వేడి రగులుతోంది. పవన్ కళ్యాణ్ భేటీలో మోడీతో ఎలాంటి షరతులతో కూడిన దోస్తిని అంగీకరిస్తారు, తన రాజకీయ ఆరంగ్రేటానికి ఎలాంటి లాభం చేకూరుతుందోనని పవన్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. వీరి ఇరువురి భేటీలో ఎలాంటి రాజకీయ సంచలనాలు, చర్చలు తెరపైకి వస్తాయన్నది మరికాసేపట్లో తేలే అవకాశముంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మోడీతో భేటీ కానున్న పవన్ కళ్యాణ్ తన పార్టీ విధి విధానాలు, బీజేపీతో కలిసి పనిచేసేందుకు కావాల్సిన లాభనష్టాలపై చర్చించనున్నారు. దీంతో సీమాంధ్రలో కొంత కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లక తప్పదని భావిస్తున్నారు. అంతేగాక ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరితో పార్టీ మరింత బలం చేకూరిందని చెప్పవచ్చు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment