పవన్ కాంగ్రెస్ పై చేసిన వ్యాఖ్యల వెనక కుట్ర ఉందో లేదో తెలియదు - చిరంజీవి.

pawan comments on congress chiru comments

పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీపై సోదరుడు, కేంద్రమంత్రి చిరంజీవి స్పందించారు. పార్టీ పెట్టడం పవన్ కల్యాణ్ వ్యక్తిగతమని ఆయన అన్నారు.  చిన్నప్పటి నుంచి పవన్ సున్నిత మనస్కుడని, సమాజానికి ఏదో చేయాలనే తపన తమ్ముడిలో ఉందని చిరంజీవి చెప్పుకొచ్చారు.  పవన్ కు భావోద్వేగాలు ఉన్నాయని.... ప్రజలకు ఎలా సేవ చేస్తారో చూడాలని అన్నారు. జనసేన పార్టీ ఎజెండా, విధివిధానాలు తనకు ఇంకా పూర్తిగా తెలియవన్నారు. దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని చిరంజీవి అన్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment