అన్నయ్యకు తమ్ముడి భయం!

జనసేన పార్టీ ఎన్నికల పార్టీ కాదంటూనే బీజేపీని వెనకేసుకొస్తున్న వైనం
అన్నయ్య చిరుకు నాకు మధ్య పోటీని దైవ నిర్ణయం మంటాడు?
కాంగ్రెస్ ను తిట్టిపోస్తూనే.... ఇతర పార్టీలపై ఆశలు పెట్టుకుంటున్నట్లు ప్రకటన
బీజేపీకి ఆంధ్ర ప్రదేశ్ ప్రచార కార్యదర్శిలా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ 

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాడీ రాజకీయ నాయకులకు అంతుచిక్కడం లేదు. ఎందుకంటే రాజకీయ
పార్టీలను నిద్రలేకుండా చేస్తున్నాడు పవన్. జనసేన పార్టీని స్థాపించిన నాడు హైదరాబాద్ లో టీఆర్ ఎస్, కాంగ్రెస్ పై దాడికి దిగాడు. అనంతరం రెండవ సారీ విశాఖ లో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీపై, వైఎస్సార్ సీపీపై పరోక్షంగా, ప్రత్యక్షంగా నిప్పులు గక్కాడు. ఎన్నికల్లో పోటీ చేయమని, తమది ఆ సిద్ధాంతం కాదంటూనే పరోక్షంగా మోడీ నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలకు, అభిమానులకు పిలుపు నిస్తున్నాడు పవన్. అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన అనంతరం రాష్ర్టం రెండు ముక్కలు కావడం చకచకా జరిగిపోయాయి. అంతేకాదు సీమాంధ్ర రాష్ర్టంలో ప్రచార కార్యదర్శి బాధ్యతలు చిరుకు అప్పగించింది కాంగ్రెస్ హై కమాండ్. అయితే ఇక్కడే వచ్చి పడింది చిక్కంతా. తమ్ముడు జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రత్యక్షంగా అన్నయ్య ఉంటున్న పార్టీనే టార్గెట్ గా ఎంచుకోవడంతో అన్నయ్యకు కష్టాలు వచ్చి పడ్డాయి. తమ్ముడి కామెంట్స్ కి అన్నయ్యపై మీడియా వేస్తున్న ప్రశ్నలకు చిరు సమాధానాలు చకచకా చెప్పలేక పవన్ (తమ్ముడు) కామెంట్స్ పై సాయంత్రం చెబుతా.. లేకపోతే.. పరిస్థితులే పవన్ ని పార్టీని పెట్టేలా చేశాయి. రాజకీయంగానే మేము వ్యతిరేకం.. అన్నదమ్ములుగా కలిసే ఉంటామంటూ చిరు కప్పదాట్లు వేస్తున్నారే తప్పా..? లోలోపల పవన్ రాజకీయ ఆరంగ్రేటం ఏమాత్రం రుచించడం లేదనే చెప్పవచ్చు.
పవన్ ప్రశ్నలకు జనం జేజేలు!
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కాంగ్రెస్ అండ ఉంటే సమాజంలో దర్జాగా చెలామణి కావచ్చని ప్రత్యక్షంగా.. పరోక్షంగా రాజకీయనాయకులపై యుద్ధానికి దిగినట్లయింది. అంతేగాక నిజాయితీ పరుడైన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను వెనుకేసుకొచ్చారు. దీంతో పవన్ ఇంతకీ అభిమతమేంది? రాజకీయాల్లోకి వచ్చాడు.. పార్టీ పెట్టాడు.. కాని ఎన్నికల్లో పోటీ చేయమంటాడు. కాని పార్టీ పెట్టింది ఎన్నికల కోసం కాదు.. రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకే అని స్పష్టమైన ప్రకటనలు ఇస్తూ... ప్రత్యక్షంగానే మోడీ భారత ప్రధాని కావాలి... బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరుతున్నాడు. దీంతో బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో పవన్ ప్రచార కార్యదర్శిలా వ్యవహరిస్తున్నారు? ఇదంతా బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ స్ర్కిప్టులో భాగమేనా? ఎందుకంటే ప్రాంతీయ పార్టీలను వదిలి కాంగ్రెస్ పార్టీపైనే విమర్శల వర్షం కురిపించడం వెనుక వున్న వ్యూహాన్ని బట్టి పవనిజం యొక్క ఉద్దేశ్యం అర్థమవుతోంది. 2014 ఎన్నికల్లో పవన్ ప్రచార కార్యక్రమం బీజేపీకి ఏ మాత్రం ఉపయోగపడుతుందో వేచిచూడాలి. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment