Video Of Day

Breaking News

పవన్ కంటే గొప్ప నాయకుడు మరెవరూ లేరు!


పవన్ కంటే గొప్ప నాయకుడు మరెవరూ లేరని సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. 'జనసేన' పేరులోనే ఇంతుంటే పార్టీలో ఇంకెంతుంటుందోనని వ్యాఖ్యానించారు. జనసేన అనే పేరు శివసేన కన్నా వెయ్యి రెట్లు మెరుగ్గా ఉందని ట్విటర్ లో పేర్కొన్నారు. జనసేన కన్నా గొప్ప పేరు ఒక పార్టీకి ఉండే అవకాశం లేదన్నారు. ప్రజారాజ్యం పార్టీలో జరిగిన అవకతవక పనులు జనసేనలో అసలు జరిగే అవకాశం లేదని వర్మ విశ్వాసం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కన్నా గొప్ప నాయకుడు దొరకడు కాబట్టి జనసేన పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి తెలుగువాళ్లు తెలివైనవారని నిరూపించుకోవాలన్నారు. తన ఉద్దేశంలో తెలివి, నీతి, అభిమానం, పౌరుషం ఉన్నవాళ్లెవరైనా పవన్ జనసేన పార్టీకి ఓటు వేస్తారని వర్మ వ్యాఖ్యానించారు.

No comments