భువనగిరిపై కన్నేసిన పొన్నాల!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య భువనగిరి స్థానంపై కన్నేశారు. 2009లో వరంగల్ జిల్లాలోని జనగాం నుంచి పోటీ చేసిన ఆయన ఈ సారి భువనగిరి ఎంపీ స్థానం కోరుకోవడం గమనార్హం. ఈ విషయం భువనగిరి స్థానం సిట్టింగ్ ఎంపీ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడికి ఫోన్‌ చేసి భువనగిరి స్థానంలో తన పేరును ముందు ఉంచాలని చెప్పడం అత్యాశేనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి ఆరోపించారు. కనీసం అధిష్ఠానం అనుమతి లేకుండా తన పేరును తానే ప్రతిపాదించుకోవడం దారుణమన్నారు. ఇలా చేయడం న్యాయం కాదని పొన్నాలకు ఫోన్‌ చేసి చెప్పానన్నారు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా సోనియా తప్పకుండా సిట్టింగ్‌ ఎంపీలకే టికెట్లు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment