పవర్ స్టార్ 5కే హార్ట్ వాక్

PawanKalyan_heart-walk.JPG

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆదివారం హైదరాబాద్ నెక్లస్ రోడ్డులో... హృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే హార్ట్ వాక్ ను ప్రారంభించారు. కార్యక్రమానికి నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ, మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రమ శ్రీనివాస్ లతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పవన్ కల్యాణ్ ప్రారంభించిన 5కే హార్ట్ వాక్ లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో యువతి, యువకులు నెక్లస్ రోడ్డుకి తరలివచ్చారు. చిన్నారుల్లో పెరుగుతున్న గుండె జబ్బులపై అవగాహన కల్పించేందుకే ఈ హార్ట్ వాక్ ను ఏర్పాటు చేసినట్లు ఫౌండేషన్ వెల్లడించింది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment