పవన్ కొత్త పార్టీ.. "జనసేన'!

Pawan Kalyan new party
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "జన సేన' అనే పేరుతో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఈనెల 14వ తేదీ శుక్రవారం నాడు ఆయన తన పార్టీ జెండా, ఎజెండా, ఇతర విషయాలను ప్రకటించేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇంకా ఈ విషయం అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ పార్టీ పెడతారన్న విషయం ఎప్పటినుంచో వినవస్తున్నా.. ఇంతవరకు ఆయన స్పందించలేదు. త్వరలో విలేకరుల సమావేశం పెడతారంటూ ఇంతకుముందు కూడా ఒకటి రెండుసార్లు తేదీలు బయటకు వచ్చినా, అలా జరగలేదు. అందరూ ఎందుకంత ఖంగారు పడతారని, త్వరలోనే పవన్ కళ్యాణ్ స్వయంగా అన్ని విషయాలు ఆయనే వెల్లడిస్తారని ఆయన సన్నిహితురాలు, పంజా సినిమా నిర్మాత తిరుమలశెట్టి నీలిమ ట్వట్టర్ ద్వారా వెల్లడించారు

. ఎట్టకేలకు శుక్రవారం నాడు పూర్తి స్థాయిలో పవన్ పార్టీ విషయం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment