రాష్ట్రపతి పాలనకు ప్రణబ్ ఆమోదం

రాష్ర్టంలో రాష్ట్రపతి పాలనకు ప్రణబ్ ముఖర్జీ శనివారం ఆమోదముద్ర వేశారు. రాష్ర్టపతి ‌భవన్ నుంచి గవర్నర్‌కు ఉత్తర్వులు అందగానే రాష్ర్టంలో రాష్ర్టపతి పాలన అమల్లోకి వస్తుంది. ఈ పాలన అమలులో ఉన్నంతకాలం రాష్ర్టానికి సంబంధించి పాలనా వ్యవహారాలను రాష్ర్టపతి, గవర్నర్ ద్వారా కేంద్రమే పర్యవేక్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ర్టపతి పాలన విధించడం ఇది రెండోసారి. గతంలో పీవీ నరసింహరావు ముఖ్యమంత్రిగా వున్న సయమంలో జై ఆంధ్ర ఉద్యమం కారణంగా శాంతి భద్రతలు అదుపు తప్పకుండా 1973 జనవరి 11 నుంచి 1973 డిసెంబర్ 10 వరకు అంటే దాదాపు 11 నెలలపాటు రాష్ట్రపతి పాలన విధించారు. దేశంలో కేంద్రం విధించిన రాష్ట్రపతి పాలనల్లో మన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం 120వ సారి. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment