ప్రియమణి గర్భవతి కాదంట!

priyamani not pregnent

ప్రియమణి గర్భవతి అంటూ మీడియాలో వచ్చిన వార్తలు వాస్తవం కాదని ఆమే స్వయంగా తెలిపారు. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా మీడియా వ్యవహరిస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రియమణి రహస్య వివాహం చేసుకున్నారని ప్రస్తుతం ఆమె గర్భిణి అని ప్రచారం మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై స్పందిస్తూ... తమిళచిత్ర పరిశ్రమకు కాస్త దూరంగా ఉండటం వల్ల తనపై లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  తాను కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండటం వల్లే తమిళ చిత్ర పరిశ్రమకు దూరం అయినట్లు వివరించారు. నిజానికి తనకు, తమిళంలోనూ అవకాశాలు వస్తున్నాయన్నారు. ఇదిలా ఉండగా ప్రియమణి త్వరలోనే తమిళ తెరపై రీఎంట్రీ చేయనున్నట్లు సమాచారం. దర్శకుడు సముద్రకని చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలిసింది.  ఈ సినిమాలో హీరోయిన్‌గా అమలాపాల్ నటిస్తున్నారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment