Video Of Day

Breaking News

టీటీడీపీ సీఎం అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య

r-krishnaiah-bc-cm-candidate-for-tdp

తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీ వర్గాలకు మరింత చేరువయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు మరో ఎత్తు వేశారు. సీమాంధ్రలో జోరుమీద దూసుకెళ్తున్న సైకిల్ సేనను తెలంగాణలోనూ బలోపేతం చేయాలని ప్రయత్నిస్తున్నారు. బీసీనే తెలంగాణలో సీఎం అభ్యర్థి అని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ అభ్యర్థిని ఖరారు చేసేందుకూ సిద్ధమవుతున్నారు. బీసీ నాయకుడిగా రాష్ట్రవ్యాప్త గుర్తింపు ఉన్న ఆర్.కృష్ణయ్యను తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే ఆర్ కృష్ణయ్య ఇప్పటిదాకా టీడీపీలో అధికారికంగా చేరలేదు. అతి త్వరలోనే ఆయన్ను లాంఛనంగా పార్టీలో చేర్చుకుని... సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటికే తెలంగాణ టీడీపీలో కొనసాగుతున్న బీసీ నేతల్లో పెల్లుబికే అసంతృప్తిని ఎలా చల్లారుస్తారో రాజకీయ చాణక్యుడు చంద్రబాబుకే తెలియాలి. 

No comments