Video Of Day

Breaking News

తెలంగాణ నుంచి రాహుల్ పోటీ?


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ సారి తెలంగాణ నుంచి పోటీ చేయనున్నారా? ఈ ప్రశ్నకు కాంగ్రెస్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే తెలంగాణ ప్రత్యక రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో ఆ క్రెడిట్ కాంగ్రెస్ ఉందని, అందులో భాగంగానే కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఊపును అందించాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని పేర్కొంటున్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయినప్పటికీ.. దాని తెచ్చిన పేరు పొందిన టీఆర్ఎస్ ప్రాబల్యం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఎలాగైనా కాంగ్రెస్ బలాన్ని పెంచే ఉద్దేశంతో రాహుల్ దీనిపై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ తెలంగాణలో పోటీ చేస్తే ఎలా ఉంటుంది? పోటీ చేస్తే తేలికగా గెలిచే సీటు ఏది?  టీఆర్‌ఎస్ బలహీనంగా, కాంగ్రెస్ బలంగా ఉన్న స్థానాలేమున్నాయి? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. అంతే కాకుండా రాహుల్ తెలంగాణ నుంచి పోటీ చేస్తే.. అన్ని స్థానాల్లో కాంగ్రెస్ కు లాభం చేకూరుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అందుకోసం రాహుల్ కూడా తనదైన స్టైల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. ఏఐసీసీ వేగులను కూడా తెలంగాణ పంపినట్లు తెలిసింది. వారు అక్కడే పాగా వేసి  కచ్చితంగా గెలిచే అవకాశమున్న పార్లమెంట్ స్థానం ఏదనే దానిపై అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

No comments