మూడో విజయంపై యువరాజు ధీమా!

rahul-confidence-on-2014-electionsత్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమి మూడోసారి విజయాన్ని అందుకుంటుందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ భారీ పరాజయం పాలవుతుందని చెబుతున్న సర్వేలను రాహుల్‌గాంధీ తోసిపుచ్చారు. కాస్తంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నమాట నిజమేని ఒప్పుకున్నారు. 2009లో సాధించిన 206 సీట్ల కన్నా ఎక్కువే గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.  ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఫలితాలపై పెద్దగా ఆశల్లేవని ఆర్థిక మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలను రాహుల్‌ తోసిపుచ్చారు. ఆదివారం ఆయన పీటీఐ వారాసంస్థకు తన నివాసంలో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపై విమర్శలు చేశాడు. 2002 అల్లర్లు మోడీ పాలనలో క్షమించరాని వైఫల్యమన్నారు.  దానిపై చట్టపరంగా బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. అల్లర్లకు నైతికంగా, పాలనా వైఫల్యానికి చట్టపరంగా మోడీ బాధ్యత వహించాల్సిదేనన్నారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment