మంచు కుటుంబంతో రెండో చిత్రం

మంచు కుటుంబంతో వరుసగా రెండో చిత్రం చేయడానికి రామ్‌గోపాల్‌ వర్మ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడాయన మోహన్‌బాబు, విష్ణులతో 'రౌడీ' తెరకెక్కిస్తున్నారు. శాన్వి కథానాయికగా నటించిన ఈ చిత్రం తుది దశకు చేరుకొంది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. మరోవైపు విష్ణు కోసం మరో కథ సిద్ధం చేసుకొంటున్నారు. ఇదో థ్రిల్లర్‌ తరహా చిత్రమట. ఇందులో విష్ణు ఓ పోలీస్‌ అధికారిగా కనిపిస్తారని సమాచారం. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. 'రౌడీ' విడుదలైన తరవాత ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి 'టెన్షన్‌ టెన్షన్‌' అనే పేరు పరిశీలిస్తున్నారు. సాంకేతిక వర్గం, ఇతర నటీనటుల వివరాలు త్వరలో ప్రకటిస్తారు.ది, శాన్వి జంటగా నటిస్తున్న చిత్రం 'ప్యార్‌ మే పడిపోయానే'. రవి చావలి దర్శకత్వం వహిస్తున్నారు. కె.కె. రాధామోహన్‌ నిర్మాత. టాకీభాగం చిత్రీకరణ పూర్తయింది. ఈనెల 11 నుంచి 18 వరకు విదేశాల్లో రెండు పాటల్ని చిత్రీకరిస్తారు. దర్శకుడు మాట్లాడుతూ ''సరదాగా సాగే ఓ ప్రేమకథ ఇది. వినోదానికి ప్రాధాన్యముంది. తెరపై ఆదిని కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశాం'' అన్నారు. ''ప్రేమకి సరికొత్త అర్థాన్నిచ్చే చిత్రమిది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment