Video Of Day

Breaking News

బాబు నెక్ట్స్ సినిమా "కొబ్బరిమట్ట"

sampoornesh babu kobbari matta

సోషల్ మీడియా, యూట్యూబ్ తో పరిచయమున్న వారందరికీ తెలిసిన పేరు సంపూర్ణేష్ బాబు. అభిమానులు ముద్దుగా సంపూ అని పిలుచుకునే ఈ బర్నింగ్ స్టార్ హ్పదయ కాలేయం సినిమాలో కథానాయకుడు. కామెడీ పంచ్ లతో, విచిత్రమైన గెటప్ లతో ఇప్పటికే నెజిటన్లను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకి దర్శకుడు స్టీవెన్ శంకర్. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దీని బిజినెస్ కూడా ఇప్పటికే పూర్తయింది. బయ్యర్లు ఫ్యాన్సీ రేటుకే రైట్స్ కొనుగోలు చేశారు. దీంతో ఈ సినిమా దర్శకుడు.. సంపూతో మరో సినిమా ప్లాన్ చేశాడు. దానికి "కొబ్బరిమట్ట " అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ కొబ్బరిమట్ట ఇంకెన్ని సంచనాలకు వేదికవుతుందో చూడాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే....

No comments