'సర్వే' స్థానానికి ఎసరు?


మల్కాజ్‌గిరి ఎంపీ స్థానం నుంచి ఎన్నికైన కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణకు ఈ సారి పార్టీ అధిష్టానం చేయిచ్చేలా ఉంది. మల్కాజ్‌గిరి స్థానం నుంచి ఆయనను తప్పించాలనుకుకోవడమే ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది. ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు కూడా సర్వేను మల్కాజ్‌గిరి వదిలి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన నాగర్‌కర్నూలుకు వెళ్లాలని సూచించినట్టు తెలిసింది. వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసి... అధిష్టానాన్ని మెప్పించి కేంద్రంలో మంత్రి పదవి పొందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పార్టీ వేగులు, ఆంతరంగిక సర్వేల నివేదికలో మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలో సర్వే సత్యనారాయణకు తీవ్ర వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తేలినందువల్లే, స్థానం మార్చాలని అధిష్టానం నిర్ణయించిందని రాజు చెప్పారట! అయితే సర్వే మాత్రం 2009లో భారీ మెజారిటీతో గెలిచానని, ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఓట్లతో విజయం సాధిస్తానని గాల్లో మేడలు కడుతున్నారట! కొప్పుల రాజు మాటను కాదంటే మ్యాటర్ మేడమ్ దగ్గరికి వెళ్తుంది కదా! అయితే మన సర్వే గారు మేడమ్ ను కలిసి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి!?
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment