మోడీని ఎదుర్కొనేందుకు శత ప్రయత్నాలు!

Narendra Modi

భాజపా ప్రధాని అభ్యర్థి మోడీ ప్రభావాన్ని అడ్డుకునేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఏ దారినీ వదలట్లేదు. మోడీకి లభిస్తున్న ఆదరణను చూసి కంగుతింటున్న కేంద్రం గుజరాత్‌ అల్లర్ల బాధిత కుటుంబ సభ్యులకు తాయిలాలు ప్రకటిస్తోంది. అలాగైనా వారి అభిమానాన్ని కొంత వరకైనా పొందొచ్చని చూస్తోంది. సదరు బాధితులకు నిఘా, సీఐఎస్‌ఎఫ్‌ పోస్టుల్లో గరిష్ఠ వయోపరిమితిని ఐదేళ్లపాటు సడలిస్తూ హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. నిఘా విభాగంలోని 514 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ గెజిటెడ్‌ పోస్టులకు, సీఐఎస్‌ఎఫ్‌లోని 123 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు హోంశాఖ దరఖాస్తులు ఆహ్వానించింది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment