శేషాచలం దావానలానికి జగన్ కారణమా!


రాజకీయాల్లో విమర్శలు ఒక్కోసారి ఊహించని స్థాయికి వెళ్తుంటాయి. వారి విమర్శల కోసం ఎవరినీ లెక్కచేయరు. పామరుడి నుంచి పండితుడి వరకు, భక్తుడి నుంచి దేవుడి వరకూ అందరినీ విమర్శల రొచ్చులోకి లాగుతారు. ఈ సారి టీడీపీ... వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పై కొత్త విమర్శను ఎక్కుపెట్టింది. అదేదో అవినీతి, అక్రమాస్తులపై కాదు. తిరుమల శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాదం జరగడానికి జగనే కారణమని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. జగన్ ఇటీవల తిరుమల వెళ్లినప్పుడు చెప్పులతో గుడికి వెళ్లాడని, అపచారం చేశారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. దాంతో శ్రీవెంకటేశ్వరస్వామికి ఆగ్రహం వచ్చిందని, దానివల్లనే అడవిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఆయన లాజిక్ చెపుతున్నారు. అయితే రాజకీయ నాయకులు తమ విమర్శల కోసం దేవుడిని, ప్రజలకు దేవుడిపై ఉన్న నమ్మకాన్ని వాడుకోకుంటే మంచిదేమో!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment