కోమటిరెడ్డి బ్రదర్స్ కు టీఆర్ఎస్ గాలం!


సొంత పార్టీలో కష్టాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ ను తమ వైపు తిప్పుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అందుకు తగినట్లుగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దక్షిణ తెలంగాణలో టీఆర్‌ఎస్ బలహీనంగా ఉన్నందున కోమటిరెడ్డి బ్రదర్స్‌ను చేర్చుకోవడం ద్వారా పార్టీ బలోపేతమవుతుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే టీఆర్‌ఎస్‌లోకి వస్తే భువనగిరి ఎంపీ సీటుతో పాటు నల్లగొండ, నకిరేకల్, ఆలేరు, మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాలను కూడా ఇస్తామని వారికి ఆఫర్ చేసినట్లు తెలిసింది. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ వీడకుండా ఉండేందుకు హైకమాండ్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అవసరమైతే ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో మాట్లాడించే అవకాశాలున్నాయి. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment